It seems that Ramachandra Rao has been selected as the BJP state president. However, it remains to be seen how he will take the party forward as president. Many BJP workers are discussing why Ramachandra Rao was given the post of president instead of Etala Rajender and Dharmapuri Arvind, who have more public support than him. It is being predicted that the BJP in the state is likely to weaken further. In this context, senior party leader Raja Singh resigned from the party. The resignation letter was sent to Kishan Reddy. With this, it can be said that the BJP president's post has created a stir in the BJP. On the other hand, there is a campaign on social media that Ramachandra Rao got the post of president due to Chandrababu's lobbying.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎంపిక అయినట్లు తెలుస్తోంది. అయితే ఆయన అధ్యక్షుడిగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఎందుకంటే ఆయన కంటే ప్రజా బలం ఉన్న ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ కాదని రామచందర్ రావుకు ఎందుకు అధ్యక్ష పదవి ఇచ్చారో అర్థం కావడం లేదని పలువురు బీజేపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ మరింత బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. దీంతో బీజేపీ అధ్యక్ష పదవి బీజేపీలో చిచ్చు పెట్టిందని చెప్పొచ్చు. మరోవైపు చంద్రబాబు లాబీయింగ్ వల్లే రామచందర్ రావుకు అధ్యక్ష పదవి వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Also Read
బీజేపీకి రాజాసింగ్ రాజీనామా - మీకు, మీ పార్టీకో దండం..!! :: https://telugu.oneindia.com/news/telangana/mla-rajasingh-resings-for-bjp-made-sensational-comments-on-the-party-441697.html?ref=DMDesc
తెలంగాణ బీజేపీ బాస్ ఎంపికలో చంద్రబాబు ? తేల్చేసిన బండి సంజయ్..! :: https://telugu.oneindia.com/news/telangana/union-minister-bandi-sanjay-clarified-to-chandrababu-role-in-telangana-bjp-chief-selection-441687.html?ref=DMDesc
మాధవ్ కు పగ్గాల వెనుక కీలక నేత - పురందేశ్వరి వాట్ నెక్స్ట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bjp-announces-madhav-as-new-party-chief-key-leader-form-ap-plays-key-role-441667.html?ref=DMDesc